పన్ను వసూళ్లలో పెద్దాపురం ఫస్ట్
పెద్దాపురం: రీజియన్ పరిధిలోని 31 మున్సిపాలిటీల్లో నూరు శాతం ఇంటి పన్నుల వసూళ్లతో పెద్దాపురం మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. జిల్లాలోని పట్టణాల అభివృద్ధిపై ఆయా పురపాలక సంఘాల అధికారులతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీలో పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై అశ్రద్ధ చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అందుబాటులో ఉండాలని చెప్పారు. సమావేశంలో పెద్దాపురం, తుని మున్సిపల్ కమిషనర్లు పద్మావతి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment