No Headline
విద్యా కానుక.. ప్రగతి దీపిక
వేసవి సెలవుల అనంతరం ఏటా జూన్ 12న పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యా కానుక పేరిట ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్టు, డిక్షనరీ వంటి వస్తువులు అందజేసేవారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు, 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పిక్టోరల్ డిక్షననరీలు అందజేసేవారు. ఈవిధంగా ఒక్క విద్యార్థికి రూ.2,419 విలువైన విద్యాకానుక అందజేయడం ద్వారా తల్లిదండ్రుల ప్రశంసలందుకున్నారు. జిల్లాలో ఏటా రూ.30 కోట్లతో 1,59,797 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించేవారు.
విద్యారంగానికి డిజిటల్ హంగులు
విద్యా రంగానికి డిజిటల్ హంగులు అద్దడం ద్వారా విద్యార్థులను తరగతి గదులకు కట్టిపడేసేలా నాటి సీఎం జగన్ కృషి చేశారు. జిల్లావ్యాప్తంగా 933 ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. 247 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్యానల్స్ (ఐఎఫ్‌పీ) అందజేశారు. వీటి సహాయంతో బోధించడం ద్వారా విద్యార్థులు మరింత సులభంగా పాఠ్యాంశాలు అర్థం చేసుకునే అవకాశం కలిగింది.
బడుల రూపురేఖల్లో మార్పు
మన బడి నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను నాటి జగన్ ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. కార్పొరేట్ తరహాలో ప్రవేశ ద్వారాలు, ఆర్చ్‌లు, బెంచ్‌లు, టైల్స్, టాయిలెట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 933 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 247 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 1,285 పాఠశాలలున్నాయి. ‘నాడు–నేడు’ మొదటి విడతలో రూ.132 కోట్లతో 441 పాఠశాలలను అభివృద్ధి చేశారు. రెండో విడతలో 881 పాఠశాలలకు రూ.334 కోట్లు మంజూరు చేశారు.
నైట్ వాచ్‌మన్ల నియామకం
విలువైన ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలు అందించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 247 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలువైన ఆస్తుల పరిరక్షణకు నాటి జగన్ ప్రభుత్వం నైట్ వాచ్‌మన్‌లను కూడా నియమించింది.
రూ.1,140 కోట్లతో ‘అమ్మ ఒడి’
జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థుల చదువుకు సరికొత్త తోడ్పాటును గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించింది. ఏటా అర్హులైన 1.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా రూ.1,145 కోట్లు పైగా అమ్మ ఒడి సొమ్ము జమ చేసేవారు. ఫలితంగా పేదింటి పిల్లలు పనులు మాని, చదువుకునే అవకాశం దక్కింది. ఆ సమయంలో జిల్లావ్యాప్తంగా హాజరు శాతం పెరగడాన్ని అప్పటి విద్యాశాఖాధికారులు గుర్తించారు.
చదువులకు
నేడు ‘చంద్ర’గ్రహణం
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గత సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలకగా.. నేడు చంద్రబాబు సీఎంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. అమ్మ ఒడినే ‘తల్లికి వందనం’ అంటూ పేరు మార్చి కూటమి నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున అందిస్తామన్న చంద్రబాబు, పవన్ మాటలు గాలిలో కలిసిపోయాయి. మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుండగా.. ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. గద్దెనెక్కగానే ప్రతి విద్యార్థి ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేస్తామని చంద్రబాబు ఘనంగా ప్రకటించగా.. అధికారంలోకి వచ్చి ఏడో నెలలో అడుగు పెట్టేసినా ఇంతవరకూ ఆ ఊసే లేదు. ఫలితంగా ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించని విద్యార్థులను ఆయా యాజమాన్యాలు పరీక్షలకు హాజరు కానివ్వడం లేదు.
జిల్లాలో జగనన్న
అమ్మ ఒడి లబ్ధి ఇలా..
సంవత్సరం లబ్ధి పొందిన లబ్ధి
తల్లులు (రూ.కోట్లలో)
2019–20 1,87,654 281.48
2020–21 2,01,247 301.86
2021–22 1,88,157 282.23
2022–23 1,86,708 280.06
మొత్తం 7,63,766 1,145.63
‘పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందీ అంటే అది చదువే’ అని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్రికరణ శుద్ధిగా నమ్మారు. ఎక్కడ ఏ సభ జరిగినా, సమావేశం జరిగినా.. ఈ విషయాన్ని పదేపదే చెప్పేవారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పరితపించేవారు. ఆ తపనతోనే తన హయాంలో ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త మార్పులు తీసుకుని వచ్చారు. అప్పటి వరకూ ప్రభుత్వ బడులంటే ఉన్న చిన్నచూపును పోగొట్టారు. ‘నాడు – నేడు’తో పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. చదువులను డిజిటల్ బాట పట్టించి.. స్మార్ట్‌గా మార్చారు. అమ్మ ఒడి, విద్యా, వసతి దీవెనలతో పేద పిల్లల ఉన్నత చదువులకు తోడ్పాటునందించారు. గోరుముద్దతో రుచికరమైన పౌష్టికాహారం అందించారు. విద్యా కానుక ద్వారా సకాలంలో నోట్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. కళాశాలల ఆధునీకరణకు సైతం నాంది పలికారు. ప్లస్–2తో ఉన్న ఊళ్లోనే ఇంటర్ విద్య చదువుకునే అవకాశం కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అడ్మిషన్ల సమయంలో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ బడులను తీసుకుని వెళ్లారు. వెరసి విద్యాప్రదాతగా ఖ్యాతి గడించారు.
నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన హయాంలో ప్రభుత్వ విద్యారంగంలో వచ్చిన వినూత్న మార్పులపై సింహావలోకనం... – సాక్షి, రాజమహేంద్రవరం
·˘ ѧéÅ Æý‡…VýS…ÌZ ¯]l*™èl¯]l çÜ…çÜPÆý‡×æÌSMýS$
గత సీఎం జగన్ నాంది
·˘ Mö™èl¢ ç³#…™èlË$ ™öMìSP¯]l
ప్రభుత్వ విద్యా వ్యవస్థ
·˘ ѧéÅÆý‡$¦ÌSMýS$ ÐólÌê¨V>
ట్యాబ్‌ల అందజేత
·˘ IG‹œï³, ÝëÃÆŠ‡t sîæÒÌS §éÓÆ> »Z«§ýl¯]l
·˘ ¯éyýl$&¯ólyýl$™ø ºyýl$ÌSMýS$ Mö™èl¢ Æý‡*ç³#
·˘ AÐ]l$à Jyìl, ѧéÅ, Ð]lç܆ ©Ððl¯]lÌS™ø
పేదల చదువులకు ప్రోత్సాహం
·˘ ¯ólyýl$ B ѧéÅ {糧é™èl f¯]lè¯]l…
Comments
Please login to add a commentAdd a comment