అధ్యాపకులు మరింత అభివృద్ధి చెందాలి
గండేపల్లి: అధ్యాపకులు మరింత అభివృద్ధి చెందాలని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.కృష్ణారావు తెలియజేశారు. మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు నిర్వహించిన సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్–1 అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. కృష్ణారావు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధ్యాపకులు తమను తాము అప్‌గ్రేడ్ చేసుకుని విద్యార్థులకు శిక్షణ ఇస్తే వారు ఉద్యోగాలు పొందడం సులభమవుతుందన్నారు. రీసోర్స్ పర్సన్లుగా తమిళనాడు ఐసీటీ అకాడమీ సీనియర్ టెక్నికల్ ట్రైనర్ జె.ఆనంద్, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ రుబియా తస్నీం వ్యవహరించి సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ బేసిక్స్, ట్రైల్‌హెడ్ ప్లేగ్రౌండ్, డేటా మోడలింగ్, సూత్రాలు, ధ్రువీకరణలు, లైట్నింగ్ ఆఫ్ బిల్డర్, డేటా భద్రత ఆమోద ప్రక్రియలతో రికార్డులను ఆమోదించడం, అపెక్స్ బేసిక్స్, డేటాబేస్, ట్రిగ్గర్స్ గురించి వివరించారు. డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ సతీష్, కె.సత్యనారాయణ, నాగేంద్ర, వివిధ కళాశాలలకు చెందిన 61 అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment