శనైశ్చరునికి రూ.6.86 లక్షల ఆదాయం
మందపల్లి శనైశ్చరాలయంలో హుండీల ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది, అర్చకులు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఉప కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో పొడగట్లపల్లి ఉప్పలపాటి జానకమ్మ అన్నదాన సత్రం ఈఓ ఎం.రాధాకృష్ణ పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, స్థానికులు లెక్కింపులో పాల్గొన్నారు. ఆరు నెలలకు గాను హుండీ ద్వారా రూ.6,85,870 ఆదాయంతో పాటు 31.500 గ్రాముల బంగారం, 754 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్టు చక్రధరరావు తెలిపారు. అన్నదాన ట్రస్ట్‌కు రూ.26,067, దేవస్థానం క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి ఆలయానికి రూ.32,957 ఆదాయంతో పాటు 4 గ్రాముల వెండి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సిద్దంశెట్టి వీవీ సత్యనారాయణ, గ్రామ పెద్దలు అడపా వెంకటేశ్వరరావు, వీఆర్‌ఓ ఉత్తరకుమారి, సేవా వలంటీర్లు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment