విశేష ఆలోచనలు.. వినూత్న ఆవిష్కరణలు
ప్రాజెక్టు: సోలార్ ఎనర్జీ
ఉద్దేశం: నేటి కాలంలో ఎక్కువవుతున్న విద్యుత్ వినియోగాన్ని అధిగమించేందుకు సోలార్ పవర్ వినియోగించడం. ఇళ్లు, కార్యాలయాల్లో సోలార్ పవర్ వినియోగించి, విద్యుత్‌ను ఆదా చేయడం.
వాడిన పరికరాలు: సోలార్ ప్యానల్స్, 2.5 బ్యాటరీ ఓల్ట్, థర్మకోల్ షీట్, ప్లేవుడ్ షీట్
విద్యార్థులు: జీహెచ్‌ఎన్‌ఎస్ అఖిల్, కార్తీక్.
టీచర్: ఎస్.పుష్పవేణి, విక్టరీ స్కూల్
ప్రాజెక్టు: రెయిన్ డిటెక్టర్
ఉద్దేశం: వర్షం వచ్చే ముందు హెచ్చరిక చేయడం. వరి పంట కోసినప్పుడు లేదా ధాన్యం ఆరబెట్టినప్పుడు అకస్మాత్తుగా వర్షం వచ్చి, పంట పాడవుకుండా సైరన్ మోగడం.
వాడిన పరికరాలు: 5 ఓల్ట్స్ బ్యాటరీ, బజర్, బ్లేడులు, వైరు, ప్యాడ్
విద్యార్థి: పి.గాయత్రి
టీచర్: వి.సుజన, జి.మామిడాడ జిల్లా పరిషత్ పాఠశాల
ప్రాజెక్టు: స్కూల్ అటెండెన్స్ స్కానర్
ఉద్దేశం: విద్యాలయాల్లో ఐడీ కార్డు స్కానింగ్ ద్వారా హాజరు నమోదు. స్కూళ్లలో మాన్యువల్ అటెండెన్స్ విధానానికి చెక్ చెప్పడం.
వాడిన పరికరాలు: కేబుల్, స్క్రీన్, రీడర్ మాడ్యులర్
విద్యార్థులు: వి.చిన్ని, ఎస్.కృష్ణతేజ, రౌతులపూడి మండలం బలభద్రపురం ఉన్నత పాఠశాల
ప్రాజెక్టు: మల్టీపర్పస్ ఫర్ హోమ్
ఉద్దేశం: ఇంట్లో క్లీనింగ్, డ్రయ్యర్, వాషింగ్, థెఫ్ట్ అలర్ట్, ఫైర్ అలర్ట్, మెసేజ్ పార్వార్డ్, ఎంటర్‌టైన్‌మెంట్, మొబైల్ చార్జర్ వంటి పనులన్నింటికీ ఉపయోగపడేలా ఒకే పరికరం రూపొందించడం.
వాడిన పరికరాలు: చార్జింగ్ మాడ్యూల్, బ్లూటూత్, హయ్యర్ సెన్సార్, గేర్ మోటార్, ఆర్‌సీ ట్రాన్స్‌లేటర్, రిసీవర్, బ్యాటరీ, పైప్
విద్యార్థి: ఎం.సాయిబాబు, ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ప్రాజెక్టు: నీటి వనరులను శుద్ధి చేయడం
ఉద్దేశం: చెరువులు, కాలువలు, నదుల్లో ఉన్న గుర్రపుడెక్క, పూడికలు తొలగించడం. వర్షాకాలం వచ్చే ముందు ఈ యంత్రంతో నీటి వనరులను శుద్ధి చేయడం ద్వారా పంటలకు సక్రమంగా సాగునీరు అందించేలా చూడటం.
వాడిన పరికరాలు: 5 డీసీ మోటార్, మోటార్ డ్రైవర్, ఫోర్ వీల్, పీవీసీ ప్లేట్లు, కన్వర్జబుల్ బెల్ట్, థర్మకోల్ షీటు.
విద్యార్థులు: ఎం.మోహన్ కుమార్, జీవీవీ దుర్గాప్రసాద్
గైడ్: ఆర్.వినయ్, పెదపూడి జిల్లా పరిషత్ పాఠశాల
ప్రాజెక్టు: మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషీన్
ఉద్దేశం: చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా మల్టీపర్పస్ మెషీన్‌తో పొలం దున్నడం, విత్తనాలు వేయడం, నేల చదును చేయడం, నీరు పెట్టడం వంటి పనులు ఒక్కరితో చేయడం.
వాడిన పరికరాలు: 12 ఓల్ట్స్ మోటార్ గేర్, పీవీసీ పైపు, ఐరన్, ప్లాస్టిక్ పైపు
తయారు చేసిన వారు: ఎంఎస్‌ఆర్ మూర్తి, బయాలజీ టీచర్, పి.చిన్నాయిపాలెం జిల్లా పరిషత్ పాఠశాల
● సైన్స్ ప్రదర్శనలో సత్తా చాటిన బాలలు
● 109 ప్రాజెక్టుల ప్రదర్శన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తమ ఆలోచనలకు సాంకేతికతను జోడిస్తూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా నమూ నా సైన్స్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం (బెంగళూరు) ఆధ్వర్యాన జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కాకినాడ సాలిపేట బాలికల హైస్కూలులో శుక్రవారం నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభ చూసిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు మొత్తం 109 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ఎమ్మెల్సీలు ఐవీ రావు, కర్రి పద్మశ్రీ, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్, సైన్స్ అధికారి వినిల్, కేసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు
వ్యక్తిగత విభాగం: మల్టీపర్పస్ మెషీన్ (ఎం.సాయిబాబు, ధర్మవరం జెడ్పీ హైస్కూల్), సోలార్ ప్యానల్ (కె.బలరామశివ, బెండపూడి). గ్రూప్ విభాగం: ప్రొడక్ట్ ఎనర్జీ ఫుట్‌స్టెప్స్ (ఎం.వందన, ఎండీ తమన్న, సామర్లకోట), అబ్‌స్ట్రాకిల్ ఎవాయిడింగ్ కార్ (డి.హర్షిత్, పి.తేజవర్ధన్, బెండపూడి) టీచర్ విభాగం: మల్టీపర్పస్ ఎగ్జిబిట్ ఆఫ్ నోకాస్ట్ (వి.తీర్థరామ్, వాకలపూడి), ఆల్‌రౌండర్ 90డిగ్రీ (పి.రవిశంకర్, యు.కొత్తపల్లి).
Comments
Please login to add a commentAdd a comment