తూర్పు తెల్లారకుండానే.. పరుగో.. పరుగు..
వేకువన ఉత్సాహంగా వార్మప్ చేస్తున్న జనం
● ఉత్సాహంగా కాకినాడ మారథాన్
● సూర్యారావుపేట బీచ్‌లో వేకువనే సందడి
● 4 కేటగిరీల్లో పోటీలు
● విజేతలకు బహుమతుల ప్రదానం
కాకినాడ రూరల్: ‘మహిళలు, బాలికలపై అణచివేతను ఆపుదాం’ అనే సామాజిక సందేశంతో కాకినాడ మారథాన్ ఏడో ఎడిషన్ సాగర తీరంలో ఆదివారం ఉత్సాహంగా జరిగింది. వేకువజామునే సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్ మారథాన్‌తో సందడిగా మారింది. ఇందులో పాల్గొనేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారితో నిర్వాహకులు తొలుత వార్మప్ నిర్వహించి, ఉత్సాహం నింపారు. అనంతరం నాలుగు కేటగిరీలుగా పరుగు నిర్వహించారు. సూర్యారావుపేట బీచ్ నుంచి ఉప్పాడ వరకూ 21 కిలోమీటర్ల మేర హాఫ్ మారథాన్‌తో పాటు 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు విభాగాల్లో ఈ పరుగు పందెం నిర్వహించారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్, సామాజిక అవగాహన అనే ప్రధాన లక్ష్యాలతో చేపట్టిన ఈ మారథాన్‌లో ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, ఎస్‌పీఎఫ్ సిబ్బందితో పాటు కాకినాడ, రూరల్‌తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి కాకినాడ సీ పోర్టు స్పాన్సరర్‌గా వ్యవహరించింది. కో స్పాన్సరర్లుగా అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, ఓఎన్‌జీసీ, రిలయన్స్, దేవీ సీ ఫుడ్స్, నేచురల్ 9, జీఆర్‌టీ బై గ్రాండ్, జేఅండ్‌ఎన్ సంస్థలు వ్యవహరించాయి. రన్‌లో పాల్గొన్న వారికి టీ షర్టులు, టైమింగ్ సిప్‌లు అందించారు. ప్రారంభ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, సీ పోర్టు సీఓఓ మురళీధరన్, వైడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
మారథాన్‌ను ప్రారంభిస్తున్న అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, సీ పోర్ట్స్ సీఓఓ మురళీధర్, వైడీ రామారావు తదితరులు
Comments
Please login to add a commentAdd a comment