చిత్ర కళలోని లోతులను అన్వేషిస్తున్నాం
దేశంలో చిత్ర కళా పోటీలు, ప్రదర్శలు ఎక్కడ జరిగినా హాజరై ప్రతిభను ప్రదర్శించడమే కాదు.. కళలోని లోతును అన్వేషిస్తున్నాం. కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా నిర్వహించే పోటీలతో పాటు ప్రదర్శనల్లో కూడా పాల్గొంటున్నాను. వేల భావాలు తెలిపే చిత్ర కళా రంగమంటే నాకు ప్రాణం. ఆ అభిమానంతోనే మూడు దశాబ్దాలుగా చిత్రాలతోనే జీవిస్తున్నాను.
– హేమా కుట్నికర్, పూణె, మహారాష్ట్ర
51 జాతీయ చిత్రకళా
పోటీల్లో పాల్గొన్నా
ఇప్పటి వరకూ 51 జాతీయ చిత్ర కళా పోటీల్లో పొల్గొని బహుమతులు సాధించాను. మూడు దేశాల్లో ప్రపంచ చిత్ర కళా పోటీల్లో నా చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. అమలాపురంలో అవర్ ఆర్టిస్ట్స్ పుస్తక సమీక్షకు నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రదర్శితమైన చిత్రాలన్నీ ఒక దానికి మించి ఒకటి భావగర్భితంగా ఉన్నాయి.
– రెహమాన్ పటేల్, చిత్రకారుడు, గుల్బర్గా, కర్ణాటక
Comments
Please login to add a commentAdd a comment