మహిళ అదృశ్యం కేసు ఛేదించిన పోలీసులు
తుని: రెండేళ్ల క్రితం అదృశ్యమైన మహిళను పట్టణ పట్టుకుని ఆమె తల్లిదండ్రులకు గురువారం అప్పగించారు. పట్టణ సీఐ గీతారామకృష్ణ కథనం ప్రకారం..2022 నవంబర్‌లో పట్టణానికి చెందిన పోతబత్తుల భాగ్యలక్ష్మి భర్త, పిల్లలను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు వుమెన్ కేసుల దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఈ కేసును ఛేదించింది. భాగ్యలక్ష్మి భర్త పోతబత్తుల బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోతబత్తుల భాగ్యలక్ష్మి భర్త, తల్లిదండ్రులకు చెప్పకుండా తన ముగ్గురు పిల్లలను వదిలేసి పని నిమిత్తం మలేసియా వెళ్లిపోయింది. రెండు సంవత్సరాల తరువాత మలేసియా నుంచి తిరిగి ఇండియాకు వచ్చి ఎవరి దగ్గరకు వెళ్లకుండా కై కలూరులో నివాసం ఉంటోంది. టీం సభ్యులు ఎస్సై విజయబాబు, సిబ్బంది శ్రీను, కిరణ్, నాయుడు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భాగ్యలక్ష్మి కై కలూరులో ఉన్నట్లు గుర్తించారు. భాగ్యలక్ష్మిని ఆమె ఇష్ట్రపకారం తీసుకొచ్చి భర్త, తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళ మిస్సింగ్ కేసును ఛేదించడంలో శ్రద్ధ చూపిన సీఐ గీతారామకృష్ణ, ఎస్సై విజయబాబు, సిబ్బందిని ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment