ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు గాయాలు
కాకినాడ రూరల్: వేకువ జామునే విధులకు వెళ్ళిన రమణయ్యపేట పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తగలపెడుతుండగా ఒక్క సారిగా వచ్చిన పేలుడుతో తీవ్రంగా గాయపడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ వద్ద రెండు రోజుల క్రితం చెత్తను తగలబెడుతుండగా సమీపంలోని ఇంటి వారు చెత్తతో ఉన్న కవర్‌ను పారిశుధ్య కార్మికులకు అందజేయడంతో దానిని చెత్త మంటలో వేయగా కొద్ది సేపటికి పెద్ద శబ్దంతో పేలి మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు పారిశుధ్య కార్మికులు కోమాటి లక్ష్మి, కాకినాడ పోచమ్మ, ధనాల గణేష్ గాయపడ్డారు. పోచమ్మ ఒంటిపై కాలిన గాయాలు తీవ్రం కావడంతో జీజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. మిగిలిన ఇద్దరు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. కవర్‌లో ఉన్న బాడీ స్ప్రే సీసాలే పేలుడుకు కారణమని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment