![చోరీ కేసులో నిందితుడి అరెస్టు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05kvr21-270112_mr-1738780887-0.jpg.webp?itok=8htKC2Tv)
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
తాళ్లపూడి: పలు చోరీ కేసుల్లో నింతుడిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దేవంలో జనవరి 30న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును ఐదు రోజుల్లో ఛేదించినట్టు ఎస్సై తెలిపారు. మలకపల్లి బస్టాండ్ వద్ద మంగళవారం గోపాలపురం మండలం బీమోలుకు చెందిన చుక్కల బాబిని నిందితుడుగా గుర్తించి అదుపులోకి తీసుకుని పోగొట్టుకున్న మంగళ సూత్రాలు, నల్లపూసలు, ఉంగరాలు, పట్టీలు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు రూరల్ సీఐ విజయబాబు పర్యవేక్షణలో సీసీఎస్ ఎస్సై రవీంద్రతో కలిసి కేసును ఛేదించి సొత్తును రికవరీ చేశారు. నిందితుడు బాబీని కోర్టులో హాజరు పరచినట్టు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment