![అలసిన మనసుకు సాంత్వన కళ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05kkd52-270120_mr-1738780889-0.jpg.webp?itok=HZy_F3bf)
అలసిన మనసుకు సాంత్వన కళ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): మానవ జీవితంలో కళ అత్యుత్తమమైనదని, అది అలసిన మనసుకు ప్రశాంతతను ఇస్తుందని సుప్రసిద్ధ కవి, సినీ గేయ రచయిత, తెలుగు అఽధికార భాషా సంఘ మాజీ సభ్యుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సురేష్‌నగర్‌లో శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో ‘హరివిల్లు–2025’ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థులలో నిద్రాణమై ఉన్న శక్తిని వెలికి తీసి, సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చేలా కళాకృతులు ఉన్నాయన్నారు. గౌరవ అతిథి భారతీయ చిత్రకారిణి, ప్రింట్ మేకర్ గౌరి వేముల మాట్లాడుతూ కళ అనేది తపస్సు అని, కళాకారుడు ఒక ఋషీశ్వరుడని అన్నారు. మందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రాంభించారు. పాఠశాల డైరెక్టర్ విజయప్రకాష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గ్రంధి రాజగోపాల్, ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకుడు కిశోర్‌కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రముఖ కవి జొన్నవిత్తుల
చిత్తు కాగితాలతో చిత్తరువుల రూపకల్పన
శ్రీప్రకాష్‌లో ఆకట్టుకున్న ‘హరివిల్లు’
Comments
Please login to add a commentAdd a comment