![స్కూల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05tun141-270072_mr-1738780890-0.jpg.webp?itok=FG4Xb3_r)
స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి
తొండంగి: మండలంలోని సీతారాంపురం గ్రామంలో బుధవారం స్కూలు బస్సు ఢీకొని మూడేళ్ల పాప మృత్యువాతపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తునికి చెందిన ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండగా సీతారాంపురంలో మూడేళ్ల పాప శివకోటి సుకన్య (3)ను బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృత్యువాతపడింది. దీంతో చిన్నారి తండ్రి శివకోటి సింహాద్రి అప్పన్న ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు కొల్లా బత్తుల దిలీప్, శివకోటి అప్పారావు, జట్టు చిన్నబాబు, అంబేడ్కర్ యూత్ సభ్యులు ఆందోళన చేయడంతో ఇన్‌చార్జి ఎస్సై బి.కృష్ణమాచారి అక్కడికి చేరుకున్నారు. దీంతో స్కూలు యాజమాన్యం స్పందించి పాప కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. పాప తండ్రి అప్పన్న ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌చార్జి ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు.
![స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05tun143-270072_mr-1738780890-1.jpg)
స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment