బాలుడిపై బాలిక ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

బాలుడిపై బాలిక ఫిర్యాదు

Published Thu, Feb 6 2025 12:12 AM | Last Updated on Thu, Feb 6 2025 12:12 AM

-

ప్రేమించి వంచించాడు..

పెళ్లంటే పొమ్మన్నాడు..

రాజానగరం: ప్రేమించానన్నాడు.. వంచించాడు.. పెళ్లి మాటెత్తితే కాదు పొమ్మన్నాడు. 16 ఏళ్ల బాలిక 18 బాలుడిపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాజానగరంలో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలు ఇలా వున్నాయి. రాజానగరానికి చెందిన ఆ మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నరేంద్రపురం కూడలిలో జులాయిగా తిరిగే ఆ బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఆమె వెంటపడేవాడు. చివరకు తనతోనే లోకం అనేలా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పదో తరగతి వరకు చదివిన ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో పెళ్లంటే తనకు ఇష్టం లేదని పొమ్మన్నాడు. దీనితో న్యాయం కోసం ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లే కావడంతో పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి, నార్త్‌ జోన్‌ డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేస్తున్నారు.

పేకాడుతున్న 9 మంది అరెస్టు

రూ.77 వేల స్వాధీనం

అమలాపురం టౌన్‌: స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో పేకాడుతున్న బృందంపై పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం రాత్రి దాడి చేశారు. 9 మంది జూదరులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.77,520 నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement