సభలో మాట్లాడుతున్న ప్రశాంత్‌రెడ్డి
దేశంలో నరేంద్రమోదీ నియంతృత్వ పాలనను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, అందుకే ఆయన కూతురు ఎమ్మెల్సీ కవితమ్మను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలంతా కవితమ్మకు అండగా ఉన్నారని, నియంతృత్వంపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేసీఆర్, కేటీఆర్‌లు ఎంతో శ్రమిస్తున్నారన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. 25 వేల పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రూ. 2.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. వాటిద్వారా 17.50 లక్షల మందికి ఉద్యోగాలు సమకూరాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment