సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
రామారెడ్డి: రైతు భరోసా, రేషన్ కార్డులకు సంబంధించిన సర్వేను అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని, అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం గొల్లపల్లిలో మండల అధికారులతో కలిసి సర్వేను ఆయన పరిశీలించారు. ఏ ఒక్క లబ్ధిదారుడు సంక్షేమ పథకాలకు దూరమవ్వకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. డీఎల్‌పీవో శ్రీనివాస్, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ జనార్థన్, ఏఈవో రాకేశ్ పాల్గొన్నారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రేషన్ కార్డుల అర్హుల కోసం చేపడుతున్న సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో సర్వేను పరిశీలించారు. అలాగే లింగంపల్లిలో జెడ్పీ సీఈవో చందర్ నాయక్ సర్వేను పరిశీలించారు. ఎంపీడీవో సంతోష్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment