చైన్‌స్నాచర్ల హల్‌చల్
భిక్కనూరు/రాజంపేట: భిక్కనూరు, రాజంపేట మండలాల్లో గురువారం పట్టపగలే చైన్‌స్నాచర్లు హల్‌చల్ చేశారు. జంగంపల్లి శివారులో ఓ మహిళ మెడలోనుంచి బంగారు గొలుసును దుండగులు అపహరించగా, ఆర్గొండలో ఓ మహిళ మెడలోనుంచి గోల్డ్‌చైన్‌ను దొంగిలించడానికి యత్నించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. రామారెడ్డి చెందిన మనెమ్మ తన కుమారుడు భాస్కర్‌తో కలిసి బైక్‌పై రాజంపేట మండలం తలమడ్లలోని బంధువుల ఇంటికి వచ్చింది. గురువారం మధ్యాహ్నం తిరిగి స్వగ్రామానికి బయలుదేరగా, జంగంపల్లి సమీపంలో వెనుకవైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వీరి వద్దకు వచ్చారు. వారిని బస్వన్నపల్లి గ్రామానికి దారి కోసం అడిగి మనెమ్మ మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని వేగంగా బైక్‌పై తలమడ్ల వైపు పారిపోయారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. చైన్ స్నాచింగ్ అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
రాజంపేట మండలంలో..
రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు గుండారం వైపు వెళ్తున్న ఆటోను వెంబడించి ఓ మహిళ మెడలోనుంచి బంగారు గొలుసు చోరీకి యత్నించినట్లు తెలిసింది. ఆటోలో ఉన్న మహిళ మెడలోని గొలుసును బైక్ పైనుంచి దుండగులు తెంపేందుకు యత్నించగా ఆటోలో ఉన్న ప్రయాణికులు గమనించారు. వెంటనే దుండగులు కామారెడ్డి వైపు పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
● జంగంపల్లిలో 3తులాల
బంగారు చైన్ అపహరణ
● ఆర్గొండలో చైన్ స్నాచింగ్‌కు యత్నం
Comments
Please login to add a commentAdd a comment