వివాహేతర సంబంధమే హత్యకు కారణం
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న దిలీప్‌శర్మ హత్య ఘటన అక్రమ సంబంధం కారణంగానే జరిగిందని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. కేసును రెండు రోజుల్లోనే చేధించి, నిందితులను గురువారం అరెస్టు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. బుస్సాపూర్‌కు చెందిన శ్రీకర్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, కోడిచర్లకు చెందిన అక్షయ ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. వీరిద్దరికి వివాహం కాలేదు. సన్నిహిత సంబంధం ఉంది. కానీ అంతకుముందు నుంచే అక్షయకు దిలీప్‌శర్మతో వివాహేతర సంబంధం ఉంది. దిలీప్‌శర్మ, శ్రీకర్ బుస్సాపూర్‌లోనే ఉండటంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈక్రమంలో అక్షయను వదిలేయమని శ్రీకర్‌ను దిలీప్‌శర్మ పలుమార్లు బెదిరించాడు. సోమవారం దిలీప్‌శర్మ ఇంట్లో ఎవరు లేకపోవడంతో అక్షయను తీసుకుని తన నివాసానికి రావాలని శ్రీకర్‌కు సూచించగా, వెళ్లారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఎలాగైన దిలీప్‌శర్మను వదిలించుకోవాలనుకున్న అక్షయ కూడా శ్రీకర్‌కే మద్దతు పలుకుతూ ఇద్దరు కలిసి సిమెంట్ ఇటుకలతో తలపై మోదీ దిలీప్‌శర్మను హత్య చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును చేధించిన ఎస్సైలు నారాయణ, నరేష్, సిబ్బందిని సీఐ అభినందించారు.
వీడిన బుస్సాపూర్ మర్డర్ మిస్టరీ
రెండు రోజుల్లోనే చేధించిన పోలీసులు
వివరాలను వెల్లడించిన
రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment