నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ
అధ్యాపకుల సంఘం క్యాలెండర్..
కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం నర్సింలు, ప్రధాన కార్యదర్శి రమే ష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంబీర్ శ్రీనివాసరా వు,ఉపాధ్యక్షుడు జయంత్ పాల్గొన్నారు.
టీఎస్–మేసా క్యాలెండర్..
కామారెడ్డి అర్బన్: తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్(టీఎస్–మేసా) జిల్లా శాఖ క్యాలెండర్‌ను కామారెడ్డి ఎఎస్పీ చైతన్యారెడ్డి గురువారం ఆవిష్కరించారు. టీఎస్–మేసా జిల్లా అధ్యక్షుడు ఎంఏ బషీర్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ రఫీక్, వర్కింగ్ అధ్యక్షుడు ఎస్‌ఏ ఖాదీర్, ప్రతినిధులు పాల్గొన్నారు.
న్యాయవాద పరిషత్ క్యాలెండర్..
కామారెడ్డి టౌన్: తెలంగాణ న్యాయవాద పరిషత్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ ఆవిష్కరించారు. న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు బి.దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.సంతోష్ శర్మ, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యదర్శులు భార్గవ్ చంద్ర భూపాల్, యాదగిరి, కోశాధికారి గంగరాజు, న్యాయవాదులు భూషణ్ రెడ్డి, భూపాల్ పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం క్యాలెండర్..
బాన్సువాడ : పద్మశాలి సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్లను గురువారం బాన్సువాడ మార్కండేయ మందిరంలో సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సంఘం నేతలు రాజయ్య, గంట్యాల బాలకృష్ణ, శ్రీనివాస్, నరహరి, జిల్లా కాశీనాథ్, వెంకటేష్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment