వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
క్రైం కార్నర్
కామారెడ్డి క్రైం: పట్టణ శివారులోని క్యాసంపల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్దుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (67) ఆస్పత్రిలో ఉన్న తన బంధువును పరామర్శించేందుకు టీవీఎస్ ఎక్సెల్‌పై ఉదయం కామారెడ్డికి వచ్చాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా క్యాసంపల్లి క్రాస్ రోడ్డు వద్ద అతడిని వెనుకనుంచి వేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొంది. ఈఘటనలో అతడి తలకు బలమైన గాయం కావడంతోఅక్కడికకక్కడే మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్ధలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
కామారెడ్డి క్రైం: పట్టణ శివారులోని జాతీయ రహదారి బ్రిడ్జిపై ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. వివరాలు ఇలా.. పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఖాసీం (56) జీఎంఆర్ కంపనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే సిరిసిల్లా రోడ్డుపై ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద రేలింగ్ ఏర్పాటు పనులకు హాజరయ్యాడు. ఈక్రమంలో నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి అతడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుడి భార్య సుల్తానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
మురికికాలువలో పడి ఒకరు..
ఖలీల్‌వాడి: నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన చౌహన్ పీరాజీ(45) మురికికాలువలో పడి మృతి చెందినట్లు ఎస్సై హరిబాబు గురువారం తెలిపారు. చౌహాన్ పీరాజీ ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడు. దీంతో అతడి కుటుంబసభ్యులు మిస్సింగ్ అయినట్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం మైసమ్మ కమాన్ వద్ద గల మురికికాలువలో అతడు మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment