ఖలీల్‌వాడి: మద్యం తాగి వాహనాలు నడిపిన 18మందికి సెకండ్ క్లాస్‌మేజిస్ట్రేట్ జైలుశిక్ష విధించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి గురువా రం తెలిపారు. ఇటీవల నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వా హనాదారులకు డ్రంకన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈక్రమంలో పట్టుబడ్డవారికి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టులో హాజరు పర్చగా వారికి స్పెషల్ జ్యుడీషియర్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్ బేగం శిక్షలు విధించినట్లు తెలిపారు. నగరంలోని రెండవటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎండీ ఆసాద్‌హైమద్, ఐదవటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోపాల్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన బద్ది భూమయ్య, అలాగే కంజరకు చెందిన అదంగిరి సాయిలు, ఠాణాకుర్థుకు చెందిన సీహెచ్ స్వామిగౌడ్, నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆదర్శనగర్‌కు చెందిన దయాకర్, మాక్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒడ్యాట్‌పల్లికి చెందిన చిన్న ఒడ్డెన్నకు ఒక రోజు జైలు శిక్ష విధించారన్నారు. ఆలాగే పిప్రికి చెందిన చాచేవార్ ప్రదీప్, నిజామాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని మారుతినగర్‌కు చెందిన ప్రకాశ్ నారాయణ్,నిజామాబాద్ రూరల్ పీఎస్ పరిధి లోని గౌతంనగర్‌కు చెందిన భూమయ్య, మోపాల్‌కు చెందిన ఇంధూర్ నాగరాజు, సిరికొండకు చెందిన బండి విజయ్, ఎండ్ల రాఖేష్, దు బ్బాక రాజ్ కుమార్,బందెల ధర్మపురి, మండలంలోని పెద్దవాల్గొట్‌కు చెందిన అల్లెపు రమేష్, కొండూర్‌కు చెందిన సాయి, పందిమడుగుకు చెందిన సుంకవక్క నర్సయ్య, చిన్నవాల్గొట్‌కు చెందిన బదాల భాస్కర్‌కు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. అలాగే నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద డ్రంకన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నామని ఎస్సై యాసీన్ ఆరాఫత్ గురువారం తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ రూ.వేయ్యి చొప్పున జరిమానా విధించగా, ఒకరికి ఒకరోజు జైలుశిక్ష విధించినట్లు తెలిపారు.
సిరికొండ: మండల పోలీస్ స్టేషన్‌లో ఇటీవల నమోదైన పలు కేసుల్లో పలువురికి రెండు రోజుల జైలు శిక్షను ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దత్తు గంగాధర్ విధించారని ఎస్సై రామ్ గురువారం తెలిపారు. డయల్ 100కు తప్పుడు ఫిర్యాదు చేసిన బండి మహేష్, బండి అశోక్‌కు, జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment