నిజామాబాద్‌నాగారం: పేదలకు నిరంతరం సేవ లందిస్తున్న ‘ఇందూరు యువత’ అందరికీ ఆదర్శ మని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బ న్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయ ణ, పైడిరాకేశ్‌రెడ్డి అన్నారు. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ 12వ వార్షికోత్సవాన్ని సంస్థ అధ్యక్షుడు ము ద్దుకురి సాయిబాబా అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఎంతో మంది అభాగ్యులకు ఇందూరు యువత అండగా నిలుస్తోందని ఎంపీ, ఎమ్మెల్యే అన్నారు. ఇందూరు యువతకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన సాయి దేవిక అనే అమ్మాయి అనారోగ్యానికి గురికావడంతో రూ. 45వేల ఆర్థికసాయాన్ని అందించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, దారం గంగాధర్, సాయిబాబా, సుశీల, స్రవంతి రెడ్డి, సుభాష్, సాయితేజ, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment