‘రహదారి నిబంధనలు పాటించాలి’
భిక్కనూరు: వాహనదారులు రహదారి భద్రత నిబంధనలను పాటించాలని జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. వాహనదారులు ఫోర్‌వీలర్లు నడిపేవారు సీట్ బెల్ట్, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. వాహనాలకు సంబంధిచంఇన అన్ని ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలను ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలను నడిపించే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment