నలుగురికే వేతనాలు ఎలా పెంచారు?
కామారెడ్డి టౌన్: మున్సిపల్ వాటర్‌వర్క్స్ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు. విధులకు వెళ్లకుండా అక్కడే బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మిక సంఘం సీఐటీయూ నాయకులు తోటి కార్మికులకు మోసం చేశారని విమర్శించారు. నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోవడం లేరని అన్నారు. 30 ఏళ్లకు పైగా సీనియారిటి ఉన్న కార్మికులను కాదని, సీఐటీయూ అనుబంధ నాయకులు రాజనర్సు, ప్రభాకర్, ప్రభు, కిరణ్‌లకు మాత్రమే రూ.20,500లకు వేతనాలు పెంచుతూ అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ ఉన్న వారందరికి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. ఫోన్‌లో కమిషనర్ స్పందనతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరారు. గురువారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కార్మికులంతా తరలివెళ్లి తమ గోడును కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు విన్నవిస్తామని కార్మికులు తెలిపారు.
అధికారులను ప్రశ్నించిన కార్మికులు
సీఐటీయూ నేతలను
నిలదీసిన తోటి కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment