నిజాంసాగర్(జుక్కల్): గోవులను తరలిస్తున్న ట్రక్కును మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులో పరిమితికి మించి 27 ఆవులను తరలిస్తుండగా పట్టుకుని గోశాలకు తరలించామని ఎస్సై సుధాకర్ తెలిపారు. బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు.
12 ట్రాక్టర్లు.. టిప్పర్..
బోధన్ రూరల్: పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సోమవారం అర్ధరాత్రి తరువాత ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లతోపాటు ఒక టిప్పర్‌ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను సిద్దాపూర్ శివారులో, టిప్పర్‌ను మందర్న శివారులో పట్టుకుని కేసు స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశామన్నారు.
కాన్పుకోసం వస్తే
ఆభరణాలు కాజేశారు
ఖలీల్‌వాడి: కాన్పుకోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన మహిళ ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం చోరీ చేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన ఓ గర్భిణీ కాన్పు కోసం కాన్పు చేయించుకునేందుకు జీజీహెచ్‌కు వచ్చింది. సదరు మహిళను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్లే ముందు ఆమె మూడు గ్రాముల బంగారం, 10తులాల వెండిని పక్కన పెట్టి వెళ్లింది. ఆపరేషన్ తరువాత వచ్చి చూసేసరికి ఆభరణాలు కనిపించకపోవడంతో ఆమె భర్త విఠల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment