ప్రజాప్రభుత్వంలో ప్రజలే పాలకులు
నిజాంసాగర్/పిట్లం(జుక్కల్): ప్రజా ప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా.. రైతులే రాజులుగా..రైతుల శ్రేయస్సే పరమావధిగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్‌లో మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల కుప్ప చేయడం వల్ల అభివృద్ధికి ఆటంకం కల్గుతోందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులు, ప్రజలు, మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి రూ. 2 లక్షల వరకు పంట రుణాలు ప్రభుత్వం వంద శాతం మాఫీ చేస్తుందన్నారు. మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసమే ఉన్నాయన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, నాయకులు విఠల్‌రెడ్డి, రాంరెడ్డి, ఏలే మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
సహకార సంఘం నూతన భవనం ప్రారంభం
పిట్లం/నిజాంసాగర్(జుక్కల్): పిట్లం మండలంలోని చిన్నకొడప్‌గల్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం, నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామ గేటు వద్ద అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Comments
Please login to add a commentAdd a comment