బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బిచ్కుంద(జుక్కల్): సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్స్ నిష్పక్షపాతంగా, గడువులోగా సర్వే పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మంగళవారం బిచ్కుంద తహసీల్ కార్యాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం సర్వే సరళిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. ప్రజలు సమగ్ర సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో గోపాల్ ఉన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై విచారణ
మండంలోని పుల్కల్, ఖద్‌గాం, హజ్గుల్, శెట్లూర్ మంజీరా నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా కొనసాగుతుంది. దీనిపై సబ్ కలెక్టర్ కిరణ్మయి విచారణ చేసి స్థానిక తహసీల్ కార్యాలయంలో ఆర్‌ఐ రవీందర్‌కు మెమో జారీ చేశారు. రెండు రోజుల క్రితం మంజీరా వద్ద కాపలాకాస్తున్న వీఆర్‌ఏలు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఆర్‌ఐ, వీఆర్‌ఏలతో ఫోన్‌లో మాట్లాడి పట్టుకున్న ట్రాక్టర్లు వదిపెట్టాలని ఆదేశించడంతో ట్రాక్టర్లను వదిలేశారు. ఆ అధికారి ముడుపులు తీసుకొని వదిలేశారని ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సబ్ కలెక్టర్ విచారణ చేపట్టారు. అలాగే అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని రూ. 5 వేలు జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment