వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
మద్నూర్(జుక్కల్): మండలంలోని సోనాల గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోజేగావ్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ దేశాయ్(39) మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గోజేగావ్ గ్రామానికి చెందిన సుబిత్రబాయి చిన్న కోడుకు లక్ష్మణ్ దేశాయ్ దేగ్లూర్‌లో ఫర్టిలైజర్ దుకాణం పెట్టుకున్నాడు. నిత్యం బైక్‌పై ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి తిరిగివస్తుంటాడు. ఈక్రమంలో బుధవారం దుకాణం వద్దకు బైక్‌పై వెళ్తుండగా సోనాల వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన లక్ష్మణ్‌దేశాయ్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించిన, అప్పటికే మృతిచెందాడు. లక్ష్మణ్‌దేశాయ్ మృతదేహాన్ని చూసిన తల్లి, భార్య, పిల్లల రోదనలు అందరిని కలిచివేశాయి. సంక్రాంతి పండగతో అందరితో కలిసి ఆనందంగా గడిపిన లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.
ఆగి ఉన్న ఆటోను ఢీకొని..
పిట్లం(జుక్కల్): రోడ్డు పక్కన ఆగిన అటోను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయిన ఘటన మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అతని బావ పురుషోత్తం ఇద్దరు కలిసి బైక్‌పై బాచిపల్లి నుంచి మద్దెలచెరువు గ్రామానికి బయలుదేరారు. సిద్ధాపూర్ గ్రామం వద్ద పిట్లం–బాన్సువాడ రోడ్డుపక్కన నిలిపి ఉన్న ఆటోను వారు వేగంగా వచ్చి ఢీకొన్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పురుషోత్తంకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడి భార్య గంగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో టీబీ వ్యాధిగ్రస్తుడైన ఓ గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ ఈనెల 7న మృతిచెందినట్లు ఒకటోటౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఆస్పత్రిలో అతడు నవంబర్ 15న అడ్మిట్ అయినట్లు తెలిపారు. వృద్ధుడు సుమారు 60ఏళ్ల వయస్సు ఉంటాడని, నలుపు రంగు స్వెటర్ ధరించి ఉన్నట్లు తెలిపారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి సంబంధించిన సమాచారం ఎవరికై నా తెలిసినచో 8712659714కు గానీ, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లోగాని సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment