అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబానికి ప్రశంస పత్రం
భిక్కనూరు: అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబానికి జీవన్‌దాన్ ట్రస్టు ప్రశంసపత్రాన్ని శుక్రవారం అందజేసింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పాపూర్‌కు చెందిన కడర్ల నడిపోల్ల బాలమల్లు గతనెల 12న ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 14న మృతిచెందాడు. జీవన్‌దాన్ ట్రస్టు ప్రతినిధులు మృతుడి కుటుంబ సభ్యులను కలిసి అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు సమ్మతి తెలిపారు. శుక్రవారం జీవన్‌దాన్ ట్రస్టు ప్రతినిధి శివకుమార్ గ్రామానికి వచ్చి బాలమల్లు భార్య అంజమ్మను సన్మానించి ఆమెకు ప్రశంస పత్రం అందించారు. కార్యక్రమంలో గ్రామస్తులు కుంట లింగారెడ్డి, భీంరెడ్డి, స్వామి, వెంకటరెడ్డి, రాజశేఖరరెడ్డి, నర్సింలు, బాబు, సిద్దరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment