‘జాతీయ స్థాయికి ఎదగాలి’
ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ అర్చరీ పోటీలు ప్రారంభిస్తున్న అసోసియేషన్ ప్రతినిధులు
దోమకొండ : జిల్లా, రాష్ట్రస్థాయి అర్చరీ పోటీల్లో రాణించి, జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని జిల్లా అర్చరీ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కామినేని అనిల్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు తిరుమలగౌడ్ క్రీడాకారులకు సూచించారు. శుక్రవారం దోమకొండ గడికోటలో ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ అర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
కార్యక్రమంలో అర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మోహన్‌రెడ్డి, సలహాదారు రాంచంద్రం, కోచ్ ప్రతాప్ దాస్, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారం మధు, నాయకులు కడారి రమేష్, బుర్రి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment