నాగిరెడ్డిపేట: జిల్లాలో ఇప్పటివరకు 1,060 ఎకరా ల వ్యవసాయేతర భూమిని గుర్తించామని అడిషన ల్ కలెక్టర్ విక్టర్ తెలిపారు. శుక్రవారం ఆయన ధ ర్మారెడ్డి గ్రామశివారులో రైతుభరోసా సర్వేను పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా చేపట్టి సాగులో లే ని భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. నాగిరెడ్డిపేట మండలంలో ఇప్పటివరకు 20 ఎకరాల వ్యవసాయేతర భూమిని గుర్తించారన్నా రు. గ్రామసభల్లో వ్యవసాయేతర భూములపై తు ది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముందుగా వ చ్చిన జాబితా ప్రకారం గ్రామాల్లో రేషన్‌కార్డు సర్వే కొనసాగుతుందన్నారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఆ ర్డీవో మన్నె ప్రభాకర్, నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీ నివాస్‌రావు, ఎంపీడీవో ప్రభాకర్‌చారి ఉన్నారు.
శెట్పల్లి సంగారెడ్డిలో..
లింగంపేట: రైతు భరోసా సర్వేను రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. శుక్రవారం ఆ యన శెట్పల్లిసంగారెడ్డిలో రైతు భరోసా సర్వేను ప రిశీలించారు. సర్వేలో తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు సేకరించాలని ఆదేశించారు. వెంచర్లు, క ట్టడాలు, కోళ్ల ఫారాలు, భవన నిర్మాణాలు, వ్యవసాయేతర భూములను క్షుణ్ణంగా పరిశీలించాలన్నా రు. ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ని ర్వహించి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్ నరేందర్‌గౌడ్, మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్, ఉపతహసీల్దార్ సంగ మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సర్వే పరిశీలన
పిట్లం: పిట్లం, చిన్నకొడప్‌గల్‌లలో శుక్రవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. రైతు భరోసా సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్, మండల వ్యవసాయ అధికారి కమల, ఆర్‌ఐ శీతల్, ఏఈవో వీణ తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్ మండలంలో..
మద్నూర్: అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం లచ్చన్, అంతాపూర్‌లలో పర్యటించి, రైతు భరోసా సర్వేను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ ముజీబ్, ఏవో రాజు, సర్వే అధికారులున్నారు.
సర్వేను వేగవంతం చేయండి
సదాశివనగర్: సాగుకు యోగ్యం కాని భూము ల గుర్తింపు సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో సర్వేను ఆయన పరిశీలించారు. గతంలో సాగు చేసిన పంట వివరాలు, ప్రస్తుతం సాగుకు యోగ్యంగా లేకపోవడానికి కారణాలను తెలుసుకోవాలన్నారు. కార్యక్ర మంలో మండల ప్రత్యేకాధికారి చందర్ నా యక్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, తహసీల్దార్ గంగాసాగర్, ఏడీవో రత్న, ఏవో ప్రజాపతి, ఏఈవో కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment