వాయుసేనలో
ఉద్యోగాలకు..
కామారెడ్డి అర్బన్: వాయుసేనలో గ్రూప్–వై (మెడికల్ అసిస్టెంట్) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కేఎస్ జగన్నాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
అతిథి అధ్యాపక పోస్టులకు..
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు, చరిత్ర గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 22న ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి
సరఫరాకు..
కామారెడ్డి అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు అవసరమైన ఎన్నికల సామగ్రి సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తిగలవారు ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలలోపు టెండర్లు వేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోగాని, 73062 45710 నంబర్‌లోగాని సంప్రదించాలని సూచించారు.
ఉచిత శిక్షణకు..
డిచ్‌పల్లి : డిచ్‌పల్లిలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వ యం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు దరఖా స్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 9 నుంచి ఎలక్ట్రిషియన్ (30 రోజులు), సీసీ టీవీ (13 రోజులు) కోర్సుల్లో శిక్షణ ప్రారంభం అవుతుందని తెలిపారు. నిజామాబాద్, కా మారెడ్డి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల కు చెందిన 19–40 ఏళ్ల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్సెస్సీ మెమో, ఐదు ఫొటోలు తీసుకువచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ సమయంలో భోజనం, హా స్టల్ సౌకర్యం పూర్తిగా ఉచితంగా అందజేస్తారన్నారు. వివరాలకు 08461– 295428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment