రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. లింగంపేటలో హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త మోహిన్ హమ్మద్ ఖాద్రీ ఫామ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఆయ న పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడుపొద్దని సూచించారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతోనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడపాలన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని కలెక్టర్ సంగ్వాన్ అన్నారు. లింగంపేటలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో 200 మందికిపైగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన వారికి న్యాయవాది ఖాద్రీ హెల్మెట్లు పంపిణీ చేయడాన్ని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవో ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఆర్‌డీవో సురేందర్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవరెడ్డి పాల్గొన్నారు.
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. తాడ్వాయి మండల కేంద్రంలో కొనసాగుతున్న సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. సర్వేను అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సర్వే ఎలా చేయాలో అధికారులకు వివరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలన్నారు. ఈ నెల 21నుంచి 24వరకు గ్రామసభలను ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సర్వే రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోఆర్డీవో రంగనాథ్‌రావు, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, తహసీల్దార్ రహిమొద్దీన్, ఎంపివో సవితారెడ్డి, ఏవో నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment