వీడని డెత్ మిస్టరీ!
● మూడు వారాలు గడిచినా
కొలిక్కిరాని కేసు
● అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో
ముగ్గురి మరణంపై అదే సస్పెన్స్
● సాక్షులు, నిందితులు,
బాధితులూ లేని కేసు
చిత్రమైన కేసు
ఏదైనా కేసులో ఎవరో ఒకరు చెరువులో పడి చనిపోతే దానికి ఎవరో ఒకరు కారణమవుతారు. బాధ్యులను పట్టుకుని విచారణ జరిపి చావుకు గల కారణాలను తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు కలిసి చనిపోయినపుడు వారి గత చరిత్ర తెలుసుకుని ఇద్దరి చావు కేసుకు వాళ్ల మధ్య ఉన్న సంబంధాలను వెల్లడిస్తారు. ఇక్కడ మాత్రం విచిత్రంగా ముగ్గురు చనిపోవడంతో ఈ కేసును విచిత్రమైనదిగానే భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ఎస్సై, కానిస్టేబుల్ ఉండడం, మరో యువకుడు కూడా ఉండడంతో ఎటూ తేల్చలేని పరిస్థితి. ఇందులో ఎవరో ఇద్దరు చనిపోయి ఉంటే, మూడో వ్యక్తి గురించి ఆరా తీసి కారణాలు తేల్చేవారు. కానీ ముగ్గురికి ముగ్గురు ఏకకాలంలో చనిపోవడంతో ఎటూ తేల్చలేకపోతున్నారు. ముగ్గురి మరణంపై అనేక ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమైనా ప్రత్యక్ష సాక్ష్యులు గానీ, సాక్షాధారాలు గానీ లేకపోవడంతో కేసు ముందుకు వెళ్లడం లేదు. చెరువు వద్దకు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏమైనా గొడవ పడ్డారా? ఎవరు ముందు దూకి ఉంటారు? ఒకరిని కాపాడేందుకు ఒకరి వెంట ఒకరు చెరువులోకి దిగారా? ఇద్దరు దూకడంతో తమపైకి వస్తుందని మిగిలిన వ్యక్తి దూకాడా ? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు పరిశోధన ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment