గొడవలు సృష్టించాలనే వాల్‌పోస్టర్లు
నందిపేట్(ఆర్మూర్): ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన ఎమ్మెల్యేను రావద్దంటూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో దొంగచాటున వాల్‌పోస్టర్లు అంటించారని బీజేపీ నాయకులు విమర్శించారు. నందిపేటలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు స్వచ్చభారత్ జిల్లా చైర్మన్ ఆదిమూలం వీరేశం డిమాండ్ చేశారు. దొంగచాటున వాల్‌పోస్టర్లు అంటించిన జోర్పూర్ రాము గతంలో ఇసపల్లి వద్ద ఎంపీ అర్వింద్ కాన్వయ్‌పై దాడి చేసి మారణాయుదాలతో హంగామా చేసిన ఘటన అందరికి తెలుసన్నారు. అతడిపై రౌడీషీటర్ ఓపెన్ చేయాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలెం రాజు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై నిలదీయాలని సీనియర్ నాయకులు లక్కంపల్లి చిన్నయ్య అన్నారు. సమావేశంలో నందిపేట, డొంకేశ్వర్ మండలాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment