విజేతలకు బహుమతుల ప్రదానం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటలో ప్రారంభించిన మండలస్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం ముగిసింది. పోచారం జట్టు ప్రథమస్థానంలో, జప్తిజాన్కంపల్లి జట్టు ద్వితీయస్థానంలో నిలిచాయి. విజేతకు రూ.7,777నగదు , రన్నర్‌కు రూ.5,555నగదును అందజేశారు.కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్‌పర్సన్ రజితారెడ్డి, మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గర్గుల్‌లో ప్రీమియర్ లీగ్ విజేతలకు..
కామారెడ్డి రూరల్: గర్గుల్‌లో జీపీఎల్ సీజన్–3లో విజేతగా నిలిచిన జట్టుకు దేవునిపల్లి ఎస్సై రాజు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు చింతల రవితేజ గౌడ్, నవీన్, మల్లేష్, అఖిల్, వినయ్ పాల్గొన్నారు.
విజేత విక్టరీ హంటర్స్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రారంభమైన మెట్టు చిన్నస్వామి జ్ఞాపకార్థం నిర్వహించిన టీపీఎల్ క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. విక్టరీ హంటర్స్ జట్టు విజేతగా నిలిచింది.
దేవునిపల్లి క్రికెట్ టోర్నీ విజేత ట్రిపుల్ ఆర్ జట్టు
కామారెడ్డి అర్బన్: దేవునిపల్లిలో దివంగత కాసర్ల శివరాజయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ బుధవారం సాయంత్రం ముగిసింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ అతిథిగా హాజరై విజేత ట్రిపుల్ ఆర్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. నిర్వాహకులు రవీందర్, రాంకుమార్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment