20రోజుల్లో 20 టీఎంసీలు ఖాళీ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా తగ్గుతుంది. ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత సంవత్సరం యాసంగి సీజన్‌కు గత నెల 25న అధికారులు నీటి విడుదలను ప్రారంభించారు. అప్పుడు ప్రాజెక్ట్‌లో 80.5 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 60.65 టీఎంసీలకు పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీటిని వదిలారు. ప్రతి రోజు సగటున టీఎంసీ నీరు తగ్గేలా ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదలను చేపడుతున్నారు. ఇదే లెక్కన నీటి విడుదల జరిగితే ప్రాజెక్ట్ ఆయకట్టు చివరి వరకు నీరు అందడం కష్టంగా మారుతుంది.
కాకతీయకు తగ్గించి.. వరదకు కొనసాగించి..
ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు తగ్గించి.. మిగుల జలాలను వదులుటకు నిర్మించిన వరద కాలువ ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 270క్యూసెక్కులు, అలీసాగర్ లిప్టు ద్వారా 405 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 797క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి అవసరాల కోసం 231క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1084.20(60.65 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
ఎస్సారెస్పీలో వేగంగా
తగ్గుతున్న నీటి మట్టం
కాలువల ద్వారా కొనసాగుతున్న
నీటి విడుదల
Comments
Please login to add a commentAdd a comment