పెద్దమల్లారెడ్డిలో బైక్ దహనం
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక బైక్‌కు నిప్పు పెట్టి దహనం చేశారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ముదాం బాల్‌రాజు సోమవారం రాత్రి తన ఇంటి ముందర తన బైక్‌ను పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి దాటక గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌కు నిప్పంటించారు. దీంతో బైక్‌తో పాటు ఇంటికి కూడ నిప్పు అంటుకుంది. ఇంట్లోని వారు గమనించగా వారు బయటకు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింంది. బాధితులు మంగళవారం భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.
సారంగాపూర్‌లో అగ్నిప్రమాదం
నిజామాబాద్ రూరల్: రూరల్ పరిధిలోని సారంగాపూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో బుధవారం ఓ దుకాణదారుడు షాపులోని చెత్తను బయటపడేసి నిప్పుపెట్టాడు. అతడి అజాగ్రత్తతో నిప్పు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది. దీంతో సారంగాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశోక్ నగరంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు అర్పివేశారు. ఈఘటనలో మేక మృతిచెందగా, ఓ బాలుడి కాలిగి గాయమైంది. ఇన్‌చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్సింగ్‌రావు, లీడింగ్ ఫైర్‌మెన్ అనంతరావు, ఫైర్‌మెన్లు హరి, జయంత్, సతీష్, బస్వరాజ్, ఫైర్ ఇంజన్ సిబ్బంది ఉన్నారు. ఈ విషయపై 6వ టౌన్ పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment