కోనాపూర్‌లో ఒకరి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన సుబ్బాని అంజయ్య (57) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సుబ్బాని అంజయ్య కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వ్యాధి బాధను భరించలేక జీవితంపై విరక్తి చెంది, ఇంట్లో పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదేరోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇస్సాపల్లిలో ఒకరు..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలోని ఇటుకబట్టిలో పనిచేస్తున్న చల్ల సీనమ్మ(45) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ బుధవారం తెలిపారు. భార్యభర్తల మధ్య మంగళవారం రాత్రి గొడవ కావడంతో మనస్తాపానికి గురికావడంతో సీనమ్మ పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
పేకాడుతున్న
9మంది అరెస్టు
ఖలీల్‌వాడి/ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి పేకాడుతున్న తొమ్మిది మందిని పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఏసీపీ సీసీఎస్ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య, సీసీఎస్ సిబ్బంది పేకాట స్థావరంపై దాడిచేసి, తొమ్మిదిమందిని పట్టుకున్నట్లు తెలిపారు.అలాగే వారినుంచి రూ.22,750 నగదు,తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
ఒకరి అదృశ్యం
ఖలీల్‌వాడి: నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన చవాన్ పీరాజీ(47) ఆదృశ్యం అయినట్లు ఎస్సై హరిబాబు ఋధవారం తెలిపారు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికిన అతడి ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment