ఖలీల్‌వాడి: నగరంలోని ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగారంలోని వడ్డెరకాలనీకి చెందిన మక్కల లక్ష్మణ్(29) అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలాగే మోపాల్ మండలం నాల్యకల్ గ్రామానికి చెందిన శ్యామ్‌రావు(55) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్‌రావు చిన్నకుమారుడు అయ్యప్పమాల ధరించడంతో అతడిచి మద్యం తాగడానికి వీలులేకుండాపోయింది. దీంతో అతడు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment