క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి
నిజామాబాద్ అర్బన్: యువత క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఖేలో భారత్ క్రీడోత్సవ్ పోటీలను ఆయన ప్రారంభించారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఇలాంటి పోటీలు నిర్వహించాలని సూచించారు. ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ మాట్లాడుతూ డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దామన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా మైదానాల్లో ఆడాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, కై రి శశిధర్, ప్రవీణ్, గొడుగు వెంకటకృష్ణ, దామ సుమన్, బాలకృష్ణ, గోపి, దుర్గాదాస్, మహేష్, ప్రీతం, గణేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment