బిచ్కుంద(జుక్కల్): మండలంలోని పుల్కల్‌లో ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆదివారం రిమాండ్‌కు తరలించామని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. ఎర్రోల ఈరవ్వ ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, గ్రామానికి చెందిన చాకలి మారుతి ఇంటి తాళాన్ని పగులగొట్టి చోరికి పాల్పడ్డాడు. ఈరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానితుడైన మారుతిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు. నిందితుడి నుంచి రూ.38వేలు విలువ చేసే బంగారం, వెండి, నగదు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment