ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వారిని సైతం ఎంపిక చేయాలి
ఇల్లులేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దసరా పండుగ తర్వాత కొందరు పేదలు ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారిని కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో చేర్చాలి. జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు కోసం భూములను కేటాయించడం జరిగింది. భూములు ఇచ్చిన రైతులు తమకు రైతుబంధు వర్తింపజేయాలని కోరుతున్నారు. వారి విన్నపాన్ని పరిశీలించాలి. అన్ని పార్టీల కృషితో పసుపు బోర్డు మంజూరైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల భాగస్వామ్యం లేకుండా ప్రారంభోత్సవం చేయడం సరికాదు.
– భూపతిరెడ్డి, ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment