మొగాలో పంట దగ్ధం
మద్నూర్(జుక్కల్): డోంగ్లి మండలంలోని మొగాలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని కంది, పత్తి పంట దగ్ధమైనట్లు ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ నర్సింలు తెలిపారు. పంటకు మంటలు అంటుకోవడంతో రైతులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సిబ్బంది సకాలంలో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో భారీ నష్టం తప్పింది. రూ.2లక్షల విలువైన పంటను ఫైర్ సిబ్బంది కాపాడారని, రూ.20వేల విలువైన పంటను దగ్ధమైందని బాధిత రైతులు తెలిపారు. ఫైర్ సిబ్బంది కరుణాకర్, నవీన్, దిగంబర్ తదితరులు మంటలను ఆర్పివేశారు.
Comments
Please login to add a commentAdd a comment