కొనసాగుతున్న ఖేలో భారత్ ఆటలు
సుభాష్‌నగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖేలో భారత్ ఆటల పోటీలు ఆ దివారం నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో కొనసాగాయి. రెండోరోజు ముఖ్యఅతిథిగా హాజరైన ఏబీవీపీ ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ క్రీడాకారులను పరిచయడం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వా మి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర్, ఇందూర్ విభాగ్ కన్వీనర్ కై రి శశిధర్, జిల్లా కన్వీనర్ ప్రవీణ్, నగర అధ్యక్షుడు గొడుగు వెంకట కృష్ణ, ఇందూరు విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ దామ సుమన్, నగర కార్యదర్శి బాలకృష్ణ, నాయకులు గోపి, దుర్గా దాస్, మహేశ్, ప్రీతం, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
సొసైటీ లెక్కలు
వెల్లడించాలని నిరాహార దీక్ష
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ సొసైటీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలను వెల్లడించాలని గ్రామానికి చెందిన వినోద్‌రెడ్డి అనే రైతు రెండు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. సొసైటీకి సంబంధించిన లెక్కల వివరాలను ఆరు నెలలకోసారి వెల్లడించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదని తెలిపాడు. అలాగే సొసైటీ పాత గోదామును 2019లో రూ.25 లక్షలకు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని దేనికి వెచ్చించారో తెలపడం లేదన్నారు. ఇదిలా ఉండగా సొసైటీకి వచ్చిన ఆదాయంతో సిబ్బంది వేతనాలు, పాత బకాయిలు చెల్లించామని సొసైటీ, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పేర్కొన్నారు. త్వరలో సొసైటీ పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment