నూతన కార్యవర్గం ఎన్నిక
ఖలీల్‌వాడి: జిల్లా న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మర్క భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మర్క భాస్కర్, ఉపాధ్యక్షులుగా పీరోళ్ల సాయినాథ్, దామోదర్ రెడ్డి, కార్యదర్శిగా టి తుకారాం, కోశాధికారిగా ఎ స్కైలాబ్ గౌడ్‌తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
జిల్లా రైతుకూలీ సంఘం..
నిజామాబాద్ సిటీ: తెలంగాణ రైతు కూలీ సంఘం, నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. జిల్లా మహాసభలను పురస్కరించుకొని నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పల్ల మల్లేశ్, కార్యదర్శిగా కత్తుల మారుతి, జిల్లా కమిటీ సభ్యులుగా రాపాక సత్యనారాయణ, కొండ అనూషవ్వ, పంజాల నర్సింలు, షేక్ రజియా బేగం, మాటూరి కనకయ్య, గారబోయిన శంకర్, అల్లె నర్సింలు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ప్రసాద్, ఉప్పలయ్య, ఈర్ల పైడి, భామండ్ల రవీందర్ పాల్గొన్నారు.
డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
ఆర్మూటౌన్: మామిడిపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీతో పాటు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎస్సై మహేశ్ ఆదివారం తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహన ధ్రువీకరణ పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. బైక్ నడిపే వారు హెల్మెట్, కార్లు నడిపే వారు సీటు బెల్టు ధరించాలన్నారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పేకాట స్థావరంపై దాడి
రాజంపేట: మండలంలోని బసవన్నపల్లి, ఆర్గోండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలిసి దాడి చేశామని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఏడు సెల్‌ఫోన్‌లు, ఆరు ద్విచక్ర వాహనాలతోపాటు రూ.58,350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment