కామారెడ్డి క్రైం: గాంధారి మండలం చద్మల్ తండాలో రూ.500 దొంగ నోట్లు రావడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం తండాలో లక్ష్మమ్మ ఆలయం వద్ద మధుర లంబాడాల భోగ్ భండార్ జాతర మూడు రోజుల పాటు జరిగింది. వేల సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. రెండు రోజుల క్రితం ఆలయ హుండీని లెక్కించారు. దాదాపు రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కొన్ని రూ.500 దొంగ నోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఆ నోటా, ఈ నోటా దొంగ నోట్ల వ్యవహారం బయటకు పొక్కింది. సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్ట్ చేయడంతో గాంధారి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎన్ని వచ్చాయి అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గాంధారి మండలంలో ఎవరైనా దొంగ నోట్లు చెలామణి చేస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment