మాస్టర్ ప్లాన్ రద్దు జీవో విడుదల చేయాలి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చే స్తూ ప్రభుత్వం వెంటనే జీవోను విడుదల చేయా లని మాస్టర్ ప్లాన్ బాధిత రైతు ఐక్య కార్యాచరణ క మిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆదివారం అ డ్లూర్‌ఎల్లారెడ్డి గ్రామంలో రైతులు సమావేశమై మా స్టర్ ప్లాన్‌పై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2022లో రైతులు పెద్ద ఎత్తున ఆందో ళనలు చేయడంతో స్పందించిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కానీ అధికారికంగా జీవో విడుదల చేయకుండా రైతుల ను మోసం చేసిందన్నారు. ఇంకా అదే మాస్టర్ ప్లాన్ ను అమలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. 2 వేల ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లుగా మార్చితే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రజాప్రతిని ధులు మౌనం వీడి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు జీ వోను విడుదల చేసేలా చూడాలని డిమాండ్ చేశా రు. రాజకీయ పార్టీలు, నేతలు, అధికారులు స్పందించకుంటే మున్సిపల్ ఎన్నికలను అడ్డుకుంటా మని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు జీవో కో సం ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడకపోవడం దారుణమన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు జీవో విడుదల చేసేంత వరకు ఆందోళనలు చే యాలని తీర్మానించారు. సమావేశంలో అడ్లూర్‌ఎల్లారెడ్డి, టేక్రియాల్, రామేశ్వరపల్లి, సరంపల్లి, దేవునిపల్లి, అడ్లూర్, లింగాపూర్, పాతరాజంపేట్ గ్రా మాల రైతులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో సమావేశమైన రైతులు
Comments
Please login to add a commentAdd a comment