పోలీసులకు సవాల్
చైన్ స్నాచింగ్ ముఠా..
సోమవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2025
– 9లో u
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పిట్లం మండల కేంద్రంలో ఈనెల 12న తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ప్రధాన రహదారికి సమీపంలోని ఏటీఎంను దొంగలు లూటీ చేశారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను విప్పి అందులో నుంచి రూ. 17.70 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు సభ్యులు గల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఏటీఎంలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లగా, కారులో ఒక వ్యక్తి ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మరో వ్యక్తి కాపలాగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏటీఎంను లూటీ చేసిన అనంతరం దొంగలు 161 వ నంబరు జాతీయ రహదారి మీదుగా కారులో పారిపోయారు. అయితే ఈ ముఠా టోల్ గేట్ మీదుగా కాకుండా సమీపాన ఉన్న మారుమూల గ్రామాల మీదుగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏటీఎంలో ప్రవేశించిన ముఠా సభ్యులు ముఖం కనబడకుండా వస్త్రంతో కట్టేసుకున్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. టెక్నాలజీ సాయంతో నేరస్తులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రికవరీ సగమే..
ఒక కేసు పరిశోధన ముగిసి దొంగలను అరెస్టు చేశారో లేదో మరో కేసు ముందుకు వస్తోంది. జిల్లాలో బైకు దొంగతనాలు, ఫోన్ల దొంగతనాలు కామన్‌గా మారాయి. ఇదే సమయంలో తాళం వేసి న ఇళ్లలో పగలు, రాత్రి తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. గతేడాది జిల్లాలో పగటి పూట 17 దొంగతనాలు, రాత్రి పూట 191 దొంగతనాలు జరి గాయి. అలాగే సాధారణ దొంగతనాలు 500 పైచిలుకు జరిగినట్లు ఇటీవల పోలీసుల వార్షిక నివేదిక లో వెల్లడైంది. కాగా గతేడాది 65 శాతం కేసులను ఛేదించిన పోలీసులు.. 53 శాతం సొత్తు రికవరీ చే శామని చెబుతున్నారు. మిగిలిన సొత్తును రికవరీ చే యాల్సి ఉంది. అది పూర్తిస్థాయిలో రికవరీ కావడం గగనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈనెల 16న భిక్కనూరు, రాజంపేట మండలాల్లో హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనంపై సంచరించిన ఇద్దరు సభ్యులు గల ముఠా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడింది. భిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులను పలకరించారు. బస్వన్నపల్లి గ్రామానికి ఎలా వెళ్లాలని అడుగుతూనే బైకుపై వెనక కూర్చున్న దొంగ మహిళ మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కుని క్షణాల్లో పారిపోయారు. అదే రోజు రాజంపేట మండలం అర్గొండ సమీపంలో ఆటోలో వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారం చైన్ లాక్కునే ప్రయత్నం చేయగా మహిళ గట్టిగా పట్టుకోవడంతో చైన్ తెగి చేతిలో ఉండిపోయింది. ఆటోలో ఉన్న వారంతా అరవడంతో దొంగలు పారిపోయారు. ఈ రెండు సంఘటనల్లోనూ ఒకే ముఠా ఉన్నట్టు స్పష్టమైంది. నంబరు లేని ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు హెల్మెట్లు ధరించి ఉన్నారు. సమీప గ్రామాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చైన్‌స్నాచింగ్ ముఠా సభ్యులు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉంటారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠా సభ్యులు (ఫైల్)
న్యూస్‌రీల్
జిల్లాలో ఇటీవల జరిగిన ఏటీఎం లూటీ, చైన్ స్నాచింగ్‌లు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఆయా కేసుల్లో ఎలాంటి ఆధారాలు వదలకుండా దొంగలు తప్పించుకున్నారు. దీంతో పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. ఈ చోరీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పనిగా అనుమానిస్తున్నారు.
పిట్లం ఏటీఎం లూటీ ఘటనలో
దొరకని ఆధారాలు
ఇతర రాష్ట్రాలకు చెందిన
ముఠా పనిగా అనుమానం
చైన్ స్నాచింగ్ కేసుల్లోనూ
పురోగతి కరువు
Comments
Please login to add a commentAdd a comment