పసుపు దిగుమతులను నియంత్రించాలి
నిజామాబాద్ అర్బన్ : పసుపు దిగుమతులను నియంత్రించి పంటకు మద్దతు ధర కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని, కానీ ఎంపీ అర్వింద్ ఒక్కడితోనే అది సాధ్యం కాలేదన్నారు. తాము పసుపు బోర్డు కోసం డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అర్వింద్ రాజకీయాల్లో కూడా లేరని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు, మద్దతు కోరుతూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశానన్నారు. పార్లమెంట్‌లో సైతం ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టానని గుర్తు చేశారు. ఎంపీ అర్వింద్ గతంలో పసుపు బోర్డును అంబాసిడర్ కారుతో పోల్చి స్పైసెస్ బోర్డు చాలన్నారని, ఇప్పుడు అంబాసిడర్ కారునే తీసుకువచ్చారని పేర్కొన్నారు. పసుపును అవహేళన చేసిన అర్వింద్‌కు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు బీజేపీ సొంత కార్యక్రమంలా చేశారని విమర్శించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులను భాగస్వామ్యం చేయలేదన్నారు. పసుపు పంట క్వింటాలుకు రూ.15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.
పసుపు బోర్డు కోసం
పార్లమెంట్‌లో కొట్లాడా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Comments
Please login to add a commentAdd a comment