అర్హులకే సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే సంక్షేమ పథకాలు

Published Mon, Jan 20 2025 1:26 AM | Last Updated on Mon, Jan 20 2025 1:26 AM

అర్హులకే సంక్షేమ పథకాలు

అర్హులకే సంక్షేమ పథకాలు

నిజామాబాద్‌ అర్బన్‌: అర్హులకే సంక్షేమ పథకాలు అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు బాసటగా నిలవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేస్తామన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్‌ కార్డుల జారీకి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆశిష్‌ సంగ్వాన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. చిన్నచిన్న లోపాలు, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని సవరించుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామన్నారు. ఈ నాలుగు కొత్త పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో అర్హులైన వారు ఆయా పథకాల కోసం దరఖాస్తులు అందించాలని సూచించారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని మంత్రి జూపల్లి వివరించారు. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఎవరికై నా మాఫీ జరగకపోతే వారికి కూడా మాఫీ అమలయ్యేలా చూస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు సు దర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ, మేయర్‌ దండు నీతూ కిరణ్‌, కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, వ్యవసాయ కమిషన్‌ సభ్యు డు గడుగు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాకేశ్‌రెడ్డి వర్సెస్‌ మానాల

ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక విధానం సరికాదన్నారు. గ్రామసభల్లో అధికార పార్టీ నాయకులే పాల్గొంటారని, ఇతరులకు అవకాశం ఇవ్వరని పేర్కొన్నారు. దీంతో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలు సరికా వని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి జూపల్లి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

మీది పెద్దల సభ.. తర్వాత మాట్లాడండి

నిజామాబాద్‌అర్బన్‌: ‘‘మీది పెద్దల సభ.. మా తర్వాత మాట్లాడండి’’ అంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కవితతో అన్నారు. సమీక్షలో ప్రభుత్వ పథకాలపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నించగా.. వెంటనే మంత్రి జూపల్లి పైవిధంగా స్పందించారు. దీంతో కవిత చివరలో మాట్లాడారు.

పాత పథకాలు యథాతథం

ఈ నెల 26నుంచి ఇందిరమ్మ ఇళ్లు,

రేషన్‌ కార్డుల జారీ

ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement